మాజీ ప్రియుడిపై కేసు పెట్టిన అమలాపాల్

మాజీ ప్రియుడిపై కేసు పెట్టిన అమలాపాల్

అమలాపాల్ తన మాజీ  ప్రియుడు భవ్నీందర్ సింగ్ పై  పరువు నష్టం కేసు పెట్టారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి  పరువుకు నష్టం కల్గించారని ఆమె చెన్నై హైకోర్టును ఆశ్రయించారు.  ఈ యేడాది మార్చిలో అమలాపాల్ తో  పెళ్లి జరిగిన ఫోటోలను  భవ్నిందర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తర్వాత ఈ ఫోటోలు ప్రొఫెషన్ కోసం తీసినవని పెళ్లికి సంబంధించినవి కావని అమలాపాల్ చెప్పారు. లేటెస్ట్ గా అభ్యంతరం వ్యక్తం చేసిన అమలాపాల్ .. భవ్నిందర్ తన పర్మిషన్ లేకుండా తన ఫోటోలు పోస్ట్ చేసి పరువుకు నష్టం కల్గించారని కోర్టును ఆశ్రయించారు. అమలాపాల్ వాదనలు విన్న న్యాయమూర్తి భవ్నిందర్ సింగ్ పై కేసు నమోదు చేసేందుకు అనుమతిచ్చారు.

ఫిట్‌‌గా ఉన్నా ఎందుకు ఎంపిక చేయలేదు.. రోహిత్ సెలక్షన్‌‌పై వివాదం