అటెన్షన్ హైదరాబాద్ పబ్లిక్.. నేరేడ్‌మెట్‌లో ట్రీట్మెంట్ కోసం.. ఈ డెంటర్ క్లినిక్కు గానీ వెళ్లారా..?

అటెన్షన్ హైదరాబాద్ పబ్లిక్.. నేరేడ్‌మెట్‌లో ట్రీట్మెంట్ కోసం.. ఈ డెంటర్ క్లినిక్కు గానీ వెళ్లారా..?

సికింద్రాబాద్: నేరేడ్‌మెట్‌లో నకిలీ డెంటల్ డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ అనే వ్యక్తి 20 ఏళ్ళుగా క్లినిక్ పెట్టి డెంటల్ సర్వీస్ చేస్తున్నాడు. యూపీకి చెందిన రమేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. టెన్త్‌ కూడా పాస్ కాకుండానే డెంటల్ డాక్టర్‌గా రమేష్ చలామణి అవుతున్నాడు. 

యూపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రమేష్ డాక్టర్ అవతారం ఎత్తాడు. రాత్రి నుంచి ఉదయం వరకు మాత్రమే రమేష్ వైద్యం చేస్తున్నాడు. రమేష్ వైద్యంపై అనుమానం రావడంతో SOT పోలీసులు సోదాలు చేశారు. రమేష్ నకిలీ డెంటల్‌ డాక్టర్‌ అని తేలడంతో మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2026 జనవరిలో కూడా ఉప్పల్లో ఇదే తరహాలో నకిలీ డాక్టర్గా చలామణి అవుతున్న బానోతు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు.

►ALSO READ | హైదరాబాద్లో వాన విధ్వంసం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో పరిస్థితి ఘోరం

ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు చదివి డాక్టర్గా చలామణి అవుతున్న వ్యక్తిని ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ బీరప్పగడ్డ శ్రీనగర్ కాలనీలో ‘అంజలి ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ పేరుతో హాస్పిటల్ నిర్వహిస్తున్న బానోతు శ్రీను డాక్టర్గా ట్రీట్‌మెంట్ చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఫార్మసీ సర్టిఫికెట్ లేకుండా మెడికల్ షాపు నిర్వహిస్తున్నారని తేలడంతో పలు మెడికల్ పరికరాలు, మందులు, పలు కిట్లు స్వాధీనం చేసుకున్నారు.