ఆడియన్స్‌‌ ప్రతి సీన్ను ఎంజాయ్ చేస్తున్నారు: వరుణ్ తేజ్

ఆడియన్స్‌‌  ప్రతి సీన్ను ఎంజాయ్ చేస్తున్నారు: వరుణ్ తేజ్

‘కొరియన్ కనకరాజు’ చిత్రానికి తాము  ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చిందని టీమ్ చెబుతోంది. వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో  రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం  శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.  సినిమాకొస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు టీమ్   ప్రెస్‌‌మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘ప్రీమియర్స్ నుంచి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది.  మొదటి నుంచి ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆడియన్స్  సినిమాలోని ప్రతి ఎపిసోడ్‌‌ను  ఎంజాయ్ చేస్తున్నారు. సత్య  కామెడీకి మరింత  రెస్పాన్స్ వస్తోంది.  ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాలని ఈ సినిమా చేశాం.  ఇప్పుడు థియేటర్లలో వాళ్లు అలా ఎంజాయ్ చేస్తుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది.  

బాబు పుట్టిన తర్వాత ఈ సక్సెస్ రావడం నాకు మరింత స్పెషల్‌‌గా అనిపిస్తోంది’ అని చెప్పాడు. ఈ సక్సెస్‌‌లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా అని రితికా నాయక్ చెప్పింది. తనకు కావాల్సిన హిట్ ఈ సినిమా రూపంలో వచ్చిందని దర్శకుడు మేర్లపాక గాంధీ అన్నాడు. చాలా రోజుల తర్వాత తమకు పెద్ద విజయం దక్కిందని, థియేటర్ల దగ్గర హౌస్‌‌ఫుల్ బోర్డులు చూడటం చాలా సంతోషంగా ఉందని నిర్మాత రాజీవ్ రెడ్డి అన్నారు.