అసెంబ్లీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

అసెంబ్లీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ గుడిలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. అసెంబ్లీ సెక్రటేరియెట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, డప్పుల వాయిద్యాలు, కళాకారుల వివిధ వేషాధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజలంతా సుభిక్షంగా, సుఖశాంతులతో ఉండాలని.. వర్షాలు సమృద్ధిగా పడాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ పేర్కొన్నారు.