కొరియా మాస్టర్స్ సూపర్‌–300 టోర్నీ: సెమీస్లో అష్మిత, రక్షిత

 కొరియా మాస్టర్స్ సూపర్‌–300 టోర్నీ: సెమీస్లో అష్మిత, రక్షిత

అసన్‌‌‌‌ (కొరియా): ఇండియా యంగ్‌‌‌‌ షట్లర్లు అష్మితా చాలియా, రక్షిత రామ్‌‌‌‌రాజ్‌‌‌‌.. కొరియా మాస్టర్స్‌‌‌‌ సూపర్‌‌‌‌–300 టోర్నీలో సెమీస్‌‌‌‌లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ఫైనల్లో వరల్డ్‌‌‌‌ 50వ ర్యాంకర్‌‌‌‌ అష్మిత 20–22, 21–15, 15–21తో వరల్డ్‌‌‌‌ 22వ ర్యాంకర్‌‌‌‌ హినా అకెచి (జపాన్‌‌‌‌)పై సంచలన విజయం సాధించింది.

దాంతో గతేడాది మలేసియా సూపర్‌‌‌‌–100 టోర్నీలో అకెచి చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. గంటా 3 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో అష్మితకు తొలి గేమ్‌‌‌‌లోనే ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ తర్వాతి రెండు గేమ్‌‌‌‌ల్లో తన ట్రేడ్‌‌‌‌ మార్క్‌‌‌‌ ఆటతో అకెచికి చెక్‌‌‌‌ పెట్టింది. మరో క్వార్టర్స్‌‌‌‌లో రక్షిత 18–21, 21–19, 21–18తో మూడోసీడ్‌‌‌‌ తన్వీ శర్మకు చెక్‌‌‌‌ పెట్టింది.

గంట పాటు జరిగిన మ్యాచ్‌‌‌‌లో రక్షిత తొలి గేమ్‌‌‌‌ను 13–8తో మొదలుపెట్టినా చివర్లో తడబడింది. తర్వాతి రెండు గేమ్‌‌‌‌ల్లోనూ తన్వీ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైనా స్వల్ప తేడాతో గట్టెక్కింది. మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో కృష్ణ ప్రసాద్‌‌‌‌–పృథ్వీ 7–21, 8–21తో మాన్‌‌‌‌ వీ చోంగ్‌‌‌‌–సోహ్‌‌‌‌ వుయ్‌‌‌‌ యి (మలేసియా) చేతిలో ఓడారు.