న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ఎరువుల కొరత లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు కోరారు. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాను ఎంపీలు సురేశ్ షెట్కర్, డాక్టర్ మల్లు రవి కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఎరువుల అవసరం, సరఫరా, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర రైతాంగ సంక్షేమాన్ని కాంక్షిస్తూ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రాఘురాంరెడ్డి, కడియం కావ్య, ఇతర ఎంపీలందరూ సంతకాలు చేసిన ప్రతిపాదన పత్రాన్ని కేంద్రమంత్రికి అందజేశారు.
