చేనేతకు అండగా నిలుద్దాం : ఎన్‌‌.రాంచందర్‌‌‌‌రావు

చేనేతకు అండగా నిలుద్దాం : ఎన్‌‌.రాంచందర్‌‌‌‌రావు

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్.. లోకల్ టు గ్లోబల్’ పిలుపు మన ప్రాచీన చేనేత కళలకు రక్షణ కవచం వంటిదని బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ ఎన్.రాంచందర్ రావు అన్నారు. దేశ చరిత్రలో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన చేనేత దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, కళాకారులు, వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు.

భారతీయ చేనేత కార్మికుల అద్భుతమైన నైపుణ్యం మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెబుతోందని ఆయన కొనియాడారు. తెలంగాణ గడ్డ చేనేత కళకు నిలయమని.. గద్వాల, నారాయణపేట, కొత్తకోట, పోచంపల్లి, సిరిసిల్ల వంటి ప్రాంతాల ఉత్పత్తులు ప్రపంచ ప్రసిద్ధి చెందాయని గుర్తుచేశారు.