హైదరాబాద్: హైదరాబాద్లో వాన విధ్వంసం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో పరిస్థితి ఘోరంగా ఉంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో వర్షం దంచి కొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ట్రాఫిక్తో వాహనదారులకు నరకం కనిపించింది.
వడగండ్ల వానతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్లపై ఎవరో రాళ్లతో కొడుతున్నట్టుగా వడగండ్లు పడేసరికి కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్లు ఎక్కడ కారు అద్దాలు పగిలిపోతాయేమోనని కంగారు పడ్డారు. మణికొండ, గచ్చి బౌలిలో కూడా వడగళ్ల వాన పడింది.
SR నగర్, మియాపూర్, కూకట్‌పల్లి, చందానగర్‌లో వాన పొట్టుపొట్టు కురిసింది. సూరారం, కొంపల్లి, దుండిగల్‌లో వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
►ALSO READ | హైదరాబాద్లో భారీ వర్షం.. ఈ ఏరియాలకు వెళ్తే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినట్టే..!
ఉప్పల్, రామంతాపూర్,అంబర్ పేట్లో ఉరుములు మెరుపులతో కూడిన చిరు జల్లుల వర్షం కురిసింది. నార్సింగి, కోకాపేట్, గండిపేట్, పుప్పాలగూడ, మణికొండ, నెక్నాపూర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలలో విద్యుత్కి అంతరాయం ఏర్పడింది.
