హైదరాబాద్‎లో భారీ వర్షం.. ఈ ఏరియాలకు వెళ్తే ట్రాఫిక్‎లో ఇరుక్కుపోయినట్టే..!

హైదరాబాద్‎లో భారీ వర్షం.. ఈ ఏరియాలకు వెళ్తే ట్రాఫిక్‎లో ఇరుక్కుపోయినట్టే..!

హైదరాబాద్‎లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని మియాపూర్‌, కూకట్‌పల్లి, చందానగర్‌, సూరారం, కొంపల్లి, దుండిగల్‌, సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, మల్లంపేట్, బౌరంపేట్, దూలపల్లి, బహుదూర్ పల్లి, సూరారం, చింతల్, షాపూర్ నగర్, గాజులరామారం, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఆల్విన్ కాలనీ, ఎల్లమ్మ బండ, హైదర్ నగర్, భాగ్యనగర్ కాలనీ, వివేకానంద నగర్, కూకట్ పల్లి, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‏బీ కాలనీ, బాలాజీ నగర్, మూసాపేట్, ప్రశాంతి నగర్, బాలానగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. 

వర్షపు నీరు భారీగా రోడ్లపైకి చేరింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులు ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడుతుండటంతో ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. వర్షం కారణంగా నగరంలోని పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. 

ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది  రంగంలోకి సహయక చర్యలు చేపట్టారు. మంగళవారం (మార్చి 24) ఉదయం నుంచి నగరంలో ఎండ దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడి ఒక్కసారిగా వర్షం కురుస్తుంది. వేడి, ఉక్కబోతతో అల్లాడిన నగరవాసులు వర్షపు జల్లులతో కాస్తా కూల్ అయ్యారు.