ఫ్యామిలీస్‌‌ మెచ్చేలా హాయ్..

 ఫ్యామిలీస్‌‌ మెచ్చేలా హాయ్..

నయనతార, కవిన్ జంటగా నటిస్తున్న చిత్ర్రం ‘హాయ్’. తమిళ సినీ గీత రచయిత విష్ణు  దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌‌‌ను నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్‌‌ చేశారు.  

ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలియజేశారు. ఈ సందర్బంగా దర్శకుడు విష్ణు మాట్లాడుతూ ‘టైటిల్‌‌కు తగ్గట్టుగానే ఇదొక సింపుల్‌‌, ఫీల్‌‌ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌. బంధాలు, భావోద్వేగాలు, హాస్యంతో కూడిన కథ.  చెన్నై, కోయంబత్తూరు, పొల్లాచ్చి నేపథ్యంలో జరుగుతుంది.  

ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్స్‌‌లో ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని చెప్పాడు.  కె. భాగ్యరాజ్, ప్రభు, రాధికా శరత్‌‌కుమార్, వీటీవీ గణేష్, సత్యన్, ఆదిత్య కథిర్, ఖురైషి కీలక పాత్రలు పోషించారు.   జెన్ మార్టిన్ సంగీతం అందించాడు.