తెలంగాణలో 15 ఏళ్లు దాటిన పాత వాహనాలు 48 లక్షల 98 వేల వాహనాలు ఉండగా.. అందులో హైదరాబాద్ లో 16 లక్షలు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రవాణా శాఖ స్క్రాపేజీ పాలసీ పై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పారు. ప్రభుత్వం 2024 సెప్టెంబరు నుంచి స్క్రాపేజీ పాలసీ విజయవంతంగా అమలు చేస్తుందన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 వెహికిల్ స్క్రాపింగ్ సౌకర్యాలు ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు , సిద్దిపేట జిల్లా వర్గల్, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్నాయి. పాత వాహనాలు స్క్రాపింగ్ ప్రోత్సహించడానికి లయబిలిటీ మాఫీ , పన్ను రాయితీలు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. పాలసీ ద్వారా స్క్రాపేజీ ప్రోత్సహించడానికి పాత వాహనం పైన ఉన్న టాక్స్ బకాయిలు రద్దు, వాహనం కొన్నప్పుడు టాక్స్ కన్షేషన్ ఇవ్వబడుతుంది. తెలంగాణ ఆర్టీసీ లో 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాప్ కు పంపిస్తున్నాం..వాటి ప్లేస్ లో ఎప్పటికప్పుడు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాము. స్క్రాప్ లపై ఎప్పటికప్పుడు ప్రత్యేక డ్రైవ్ చేయబడుతున్నాయి. 15 సంవత్సరాలు దాటిన స్కూల్ బస్సులకు అనుమతి లేదు. కొత్త వాహనాలు కొన్నప్పుడు టాక్స్ కాన్సేషన్ మోటార్ సైకిల్ కు రూ 5 వేల వరకు , కారులకు 50 వేల వరకు , ట్రాన్స్ ఫోర్ట్ వాహనాలకు 19 శాతం టాక్స్ మినహాయింపు ఉంటుంది. స్క్రాప్ పాలసీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6278 వాహనాలు స్క్రాప్ చేయబడ్డాయి.
గ్రీన్ టాక్స్ 2006 లో అమలులోకి వచ్చింది.. 2022 లో పెంచుతాం. 2025-26 లో గ్రీన్ టాక్స్ రూ.71.14 కోట్లు వసూలు దాదాపు 2 లక్షల వాహనాలకు జరిగింది. 2024-25 లో గ్రీన్ టాక్స్ 68.11 కోట్లు వసూలు చేయడం జరిగింది . ఇప్పటి వరకు 6278 వాహనాలు స్క్రాప్ చేయబడ్డాయి. 15 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ వాహనాలు స్క్రాప్ తప్పనిసరి చేసింది. గత ఏడాది 4285 వాహనాలు స్క్రాప్ చేయబడ్డాయి.. ప్రైవేట్ వాహనాలు దాదాపు 2 వేల వాహనాలు స్క్రాప్ చేయబడ్డాయి. 15 సంవత్సరాలు దాటిన ప్రైవేట్ వాహనాలకు స్క్రాప్ తప్పనిసరి కాదు కండిషన్ లో ఉన్నంత వరకు వెహికిల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో 15 సంవత్సరాలు కంటే పాత వాహనాలు 48 లక్షల 98 వేల వాహనాలు ఉన్నాయి.. హైదరాబాద్ లో 16 లక్షలు ఉన్నాయి. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా స్క్రాపేజీ పాలసీ ఎందుకు తీసుకురాలేదు. రవాణా శాఖ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే , ఎమ్మెల్సీలకు ఈవి వాహనాలు కొనడానికి లోన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఈరోజు నుండి ఈవీ పాలసీ లో భాగంగా వాహనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ ఉద్యోగులకు సైతం 15-20 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
