హైదరాబాద్‎లో బంకులకు పొటెత్తిన బండ్లు.. కిలో మీటర్ల మేర క్యూ.. యుద్ధ భయమే అసలు కారణం..!

హైదరాబాద్‎లో బంకులకు పొటెత్తిన బండ్లు.. కిలో మీటర్ల మేర క్యూ.. యుద్ధ భయమే అసలు కారణం..!

హైదరాబాద్‎లో పెట్రోల్ బంకులకు వాహనాలు పొటెత్తాయి. నగరంలోని మెజార్టీ బంకులు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని బంకుల దగ్గర వాహనాలు కిలో మీటర్ల మేర క్యూకట్టిన పరిస్థితులు కనిపిస్తు్న్నాయి. ఇందుకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధమే. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్ కొరత రానుందనే భయంతో వాహనదారులు బంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో మంగళవారం (మార్చి 24) సిటీలోని బంకుల దగ్గర తీవ్రమైన వాహనాల రద్దీ నెలకొంది.

 పెట్రోల్, డిజిల్ మళ్లీ దొరుకుతుందో లేదోననే భయంతో అవసరానికి మించి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. వాహనదారులు ఒక్కసారిగా బంకుల బాట పట్టడంతో సిటీలోని చాలా బంకుల్లో ఇంధన నిలువలు తగ్గిపోయాయి. హైదరాబాద్ నగరంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. కొన్ని చోట్ల బంకుల దగ్గర నో స్టాక్  బోర్డులు పెట్టగా.. మరికొన్ని చోట్ల బంకులను క్లోజ్ చేశారు నిర్వాహకులు. 

►ALSO READ | అటెన్షన్ హైదరాబాద్ పబ్లిక్.. నేరేడ్‌మెట్‌లో ట్రీట్మెంట్ కోసం.. ఈ డెంటర్ క్లినిక్కు గానీ వెళ్లారా..?

వాహనాలు ఒక్కసారి పొటెత్తడంతో కొన్ని చోట్ల బారికేడ్లు అడ్డం పెట్టి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సీఎన్‎జీ  స్లేషన్ల దగ్గర కూడా ఇదే సిట్యూవేషన్. సీఎన్జీ స్టేషన్ల ముందు ఆటోలు కిలో మీటర్లు మేర క్యూ కట్టాయి. మరోవైపు దేశంలో ఇంధన కొరత లేదని.. వాహనదారులు ఆందోళన చెందొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినప్పటికీ యుద్ధ భయంతో వాహనదారులు బంకులకు పొటెత్తి ట్యాంకులు ఫుల్ చేయిస్తు్న్నారు.