తెలంగాణ సంక్షేమ గురుకులాల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల

తెలంగాణ సంక్షేమ గురుకులాల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ సంక్షేమ గురుకులాల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి.  మంగళవారం (మార్చి 24) రాత్రి ఫలితాలు విడుదల చేశారు అధికారులు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు అధికారులు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, రిజల్ట్స్ పేజీలో కనిపించే వెరిఫికేషన్ కోడ్‎ను ఎంటర్ చేసి రిజల్ట్ చూసుకోవచ్చని తెలిపారు. కాగా, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9వ తరగతి రెగ్యులర్, బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం సాంఘిక సంక్షేమ శాఖ ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

►ALSO READ | ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు: లీగల్ కన్సల్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు..