ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు: లీగల్ కన్సల్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు..

 ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు: లీగల్ కన్సల్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు..

ఆదాయపు పన్నుశాఖ  లీగల్ కన్సల్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: లీగల్ కన్సల్టెంట్ 04, యంగ్ ప్రొఫెషనల్స్ 04. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కనీసం మూడేండ్ల పని అనుభవం ఉండాలి .

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీ, మాజీ సైనికులకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 13.

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.incometaxindia.gov.inను సందర్శించండి.