తులం బంగారం ఇవాళ 3 వేలు తగ్గింది.. నిన్నయితే ఏకంగా రూ.2వేల 700 డౌన్

తులం బంగారం ఇవాళ 3 వేలు తగ్గింది.. నిన్నయితే ఏకంగా రూ.2వేల 700 డౌన్

దాదాపు 10 రోజులుగా బంగారం రేట్లు వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఇరాన్ యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. ఒకపక్క డాలర్ బలపడుతుండటంతో మరోపక్క గోల్డ్ రేట్లు పతనం అవుతున్నాయి. వాస్తవానికి యుద్ధం వంటి సమయాల్లో పెరగాల్సిన గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గుతుండటంతో ఇన్వెస్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే రిటైల్ పెట్టుబడిదారులు మాత్రం తగ్గుతున్న ధరలతో తమ షాపింగ్ ప్లాన్స్ తిరిగి స్టార్ట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కొనుగోలుకు ముందు మీ నగరాల్లో తాజా రేట్లను ముందుగా పరిశీలించండి. 

మార్చి 24న బంగారం రేట్లు భారీగానే తగ్గాయి. మార్చి 23 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.294 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 035గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 865గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : హైదరాబాద్లో ఫ్లాట్ల పేరిట రూ.15 కోట్ల మోసం..

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మార్చి 24, 2026న దేశవ్యాప్తంగా రూ.5వేలు పెరిగింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 40వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.240 వద్ద ఉంది.