ఏపీ నుంచి అమరరాజా బ్యాటరీస్ జంప్?

ఏపీ నుంచి అమరరాజా బ్యాటరీస్ జంప్?

అమరావతి: జన్మభూమిలో ఉపాది మార్గాలు పెంచాలనే లక్ష్యంతో చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన ప్రముఖ బ్యాటరీస్ కంపెనీ అమరరాజా.. ఏపీకి నుంచి తరలిపోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీని చెన్నైకి తరలించనున్నట్లు సమాచారం. తాజాగా అమరరాజా కంపెనీ యాజమాన్యం.. తమిళనాడు సీఎం స్టాలిన్‌లో చర్చలు జరిపింది. అమరరాజాకు కంపెనీకి స్టాలిన్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరచిందని.. ఇప్పటికే స్ధలం కూడా కేటాయించినట్లు సమాచారం. తమిళనాడు ప్రభుత్వం కేటాయించిన స్ధలంలో కంపెనీ కోసం ముమ్మరంగా పనులు సాగుతున్నట్లు కూడా తెలుస్తోంది. అక్కడ నిర్మాణ పనులు పూర్తవ్వగానే మరో మూడు నెలల్లో అమరరాజా కంపెనీ చిత్తూరు నుంచి తమిళనాడుకి తరలివెళ్ళనుంది.

బ్యాటరీ సెక్టార్‌లో దేశంలోనే 2వ అతిపెద్ద సంస్ధగా ఉన్న అమరరాజా కంపెనీ.. 1 బిలియన్ డాలర్ల టర్నోవర్‌తో నడుస్తోంది. ఈ కంపెనీ ప్రతి సంవత్సరం పన్నుల రూపంలో రూ. 2400 కోట్లు చెల్లిస్తుంది. అందులో ఏపీ వాటాగా రూ. 1200 కోట్లు చెల్లిస్తుంది. ఏపీ ఉన్న ఈ కంపెనీలో వేలమందికి జీవనోపాది లభిస్తోంది. కంపెనీ తరలింపుతో వేలాదిమంది కార్మికులు రోడ్డున పడనున్నారు.