అద్భుతం : దేవుడు కళ్లల్లో.. గుండెల్లో ఉంటే.. టాలెంట్ ఇలాగే ఉంటుంది

అద్భుతం : దేవుడు కళ్లల్లో.. గుండెల్లో ఉంటే.. టాలెంట్ ఇలాగే ఉంటుంది

సోషల్ మీడియాలో చాలా వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటాయి. తమ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచే నైపుణ్యం కలిగిన వ్యక్తులకు భారతదేశంలో కొరత లేదు. కానీ అలాంటి చిత్రాలు లేదా వీడియోలు గ్రామాల నుంచి, వీధుల నుంచి వచ్చినప్పుడు, కలిగే ఆ అనుభూతే వేరు కదా. ఈ తరహాలోనే ఓ క్లిప్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఒక మహిళ వెనక్కి తిరిగి చూడకుండా బజరంగబలి చిత్రాన్ని రూపొందించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లోని పూనమ్ ఆర్ట్ అకాడమీ పేజీలో షేర్ చేయబడిన ఈ వీడియో... దీన్ని ఓ మహిళ అధికారిక ఖాతాగా తెలుస్తోంది. ఈ క్లిప్‌లో, ఒక మహిళ తన రెండు చేతుల్లో సుద్ద పట్టుకుని ఉండటం, వెనుక ఉన్న నల్లటి కాన్వాస్ పై వెనుకకు తిరిగి చూడకుండా, రెండు చేతుల్తో బజరంగబలి చిత్రాన్ని రూపొందించింది. ఒక్కసారి కూడా వెనుదిరిగి చూడని ఈ అందమైన చిత్రాన్ని గీసే విధానాన్నిచూస్తే నిజంగా మీరు కూడా షాక్ అవుతారు. ఇది సోషల్ మీడియాలో షేర్ అయిన కొన్ని సెకన్లలోనే వైరల్‌గా మారడం ప్రారంభమైంది.

ఈ వీడియోను లక్షకు పైగా వ్యూస్ రాగా, 88 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. వేల మంది కామెంట్లు చేశారు. మీ కళాత్మకతకు సెల్యూట్ అని యూజర్స్ ప్రశంసించారు. భారతదేశ వీధుల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచం చూసేలా తనలాంటి వారిని ఆదరించాలని మరొకరు వ్యాఖ్యానించారు. చాలా అందంగా అద్భుతంగా గీసిందని, మీ కళకు వందనం అని ఇంకొకరు చెప్పగా.. కామెంట్ సెక్షన్‌లో 'జై శ్రీరామ్' నినాదాలు వెల్లువలా సాగాయి. దీన్ని బట్టి చూస్తే, ఈ ఖాతా కేవలం మహిళ అధికారిక ఖాతానే అని తెలుస్తోంది. ఎందుకంటే దీని బయోలో ఆర్ట్ ఇన్ మై లైఫ్ అనే యూట్యూబ్ ఛానెల్ పేరు, 300K+ ఫ్యామిలీ అని రాసి ఉంది.

https://www.instagram.com/reel/CuJVwctAiOI/?utm_source=ig_embed&ig_rid=7442168a-96c5-4a30-bd6e-33b5e2447811