నాన్–ఎసెన్షియల్ గూడ్స్ డెలివరీకి పర్మిషన్ ఇయ్యండి

నాన్–ఎసెన్షియల్ గూడ్స్ డెలివరీకి పర్మిషన్ ఇయ్యండి

ప్రభుత్వాన్ని కోరిన అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్
న్యూఢిల్లీ: లాక్ డౌన్ లో నాన్–ఎసెన్షియల్ గూడ్స్ డెలివరీకి అనుమతి ఇవ్వాలని ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. లాక్ డౌన్ ఎక్కువ రోజులు కొనసాగుతున్నందున ప్రజల అవసరాలను తీర్చాల్చి ఉందని ఆ కంపెనీలు నొక్కి చెప్పాయి. తమకు అనుమతినిస్తే ప్రాడక్ట్స్ ను సేఫ్ గా, సెక్యూర్ గా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ డెలివర్ చేస్తామని పేర్కొన్నాయి. ఈ–కామర్స్ ను అనుమతించి కరోనా మహమ్మారిపై పోరులో తమకూ భాగస్వామ్యం కల్పించాలని అమెజాన్ ఇండియా గవర్నమెంట్ కు విజ్ఞప్తి చేసింది. ఎమ్ ఎస్ ఎమ్ ఈపై పడే భారాన్ని తగ్గించడంలో ఈ–కామర్స్ దోహదపడుతుందని, డెలివరీలను రోబస్ట్ సేఫ్టీ ఏవోపీతో సురక్షితంగా డెలివరీ చేస్తామని ఫ్లిప్ కార్ట్ కోరింది. ఈ–కామర్స్ కంపెనీలు ఎసెన్షియల్ గూడ్స్ డెలివరీ చేయడానికే పరిమితమవుతాయని కేంద్ర హోం శాఖ శనివారం స్పష్టం చేసింది. ఈ–కామర్స్ కంపెనీలను అనుమతిస్తే అవి ఎలాంటి ప్రాడక్ట్స్ అమ్ముతాయనే దానిపై ప్రభుత్వానికి కొన్ని సందేహాలు ఉన్నాయి. లాక్ డౌన్ మొదట్లో కేంద్రం ఈ–కామర్స్ ను అనుమతించినప్పుడు మొబైల్ ఫోన్స్, రిఫ్రిజిరేటర్స్, బట్టలు, టెలివిజన్ సెట్స్, ల్యాప్ టాప్స్ లాంటి వాటిని అవి అమ్మాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఎసెన్షియల్ గూడ్స్ మాత్రమే డెలివరీ చేయాలని ఆదేశించింది. అలాగే మిగతా ప్రాడక్ట్స్ డెలివరీపై నిషేధం విధించింది.