ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి తన ఉద్యోగులకు షాకిచ్చింది. మూడు నెలల్లో రెండో సారి లేఆఫ్స్ ప్రకటించింది. గత అక్టోబర్ లో 14 వేలమంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్.. తాజాగా 16వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ నోటీలిసులిచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పెరుగుతున్న పోటీ కారణంగా అమెరికాలోని 16వేల మంది ఉద్యోగులకు ప్రభావం చూపనుందని అమెజాన్ పీపుల్స్ ఎక్స్ పీరియెన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గెలెట్టి తన సోషల్ మీడియా బ్లాగ్ పోస్ట్ రాశాడు. కంపెనీ లిస్టవుట్ చేసిన ఉద్యోగులకు లేఆఫ్స్ ఈమెయిల్స్ పంపించారు. ఉద్యోగులు 90 రోజుల్లో కొత్త ఉద్యోగాన్ని వెత్తుక్కోవాలని, వారికి సెటిల్ మెంట్లు చేస్తామని వెల్లడించారు.
2025 అక్టోబర్ లో 14వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత తాజా మరోసారి పెద్ద సంఖ్యలో అమెజాన్ తొలగింపులు చేపట్టింది. గతేడాది అమెజాన్ తన కార్యకలాపాలను ఆటోమేట్ చేయడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో శ్రామిక శక్తి అవసరం తగ్గింది.. ఇంకా ప్రతి మూడు నెలలకోసారి అమెజాన్ తన వర్క్ ఫోర్స్ ను తగ్గించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
►ALSO READ | ఈయూ డీల్తో కార్ల రేట్లు సగానికి తగ్గుతాయా..? బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యూ, వోక్స్వ్యాగన్ రేట్లు ఎంత తగ్గొచ్చు?
అమెజాన్ ప్రస్తుతం 1.57మిలియన్లు(15లక్షల 70వేలు) మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరిలో ఎక్కువ మంది గిడ్డంగులలో పనిచేస్తున్నారు. ఇక కార్పొరేట్ వర్క్ ఫోర్స్ విషయానికొస్తే 3లక్షల 50 వేల మంది ఉద్యోగులున్నారు. వీడియో గేమ్ విభాగాన్ని మూసివేయడం ద్వారా 2026లో మరిన్ని ఉద్యోగాలు ఊడే అవకాశం ఉందని అమెజాన్ సంకేతాలిచ్చింది.
