ప్రైమ్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. వార్షిక ప్లాన్ పై రూ.200 తగ్గింపు

ప్రైమ్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. వార్షిక ప్లాన్ పై రూ.200 తగ్గింపు

అమెజాన్ ప్రైమ్ యూజర్స్ కి గుడ్ న్యూస్. తాజాగా ప్రమ్ లైట్ మెంబర్ షిప్ ధరలను ప్రకటించింది. రూ.999గా ఉన్న అమెజాన్ ప్రైమ్ సపోర్ట్ మెంబర్షిప్ ను రూ.799గా నిర్ణయించింది. అంతకుముందు ఈ మెంబర్ షిప్ నెలకు రూ.299, 3నెలలకు రూ.599, ఇయర్ ప్లాన్ రూ.1,499గా ఉండేది. ఆ తర్వాత ప్రైమ్ లైట్ ను జూన్ లో ప్రారంభించిన అమెజాన్.. రూ.999కు ప్లాన్ ధరలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది.

సాధారణ ప్రైమ్ మెంబర్ షిప్ తో పోలిస్తే.. ప్రైమ్ లైట్ మెంబర్ షిప్ కొంచెం తక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఈ-కామర్స్ ప్లాట్ ఫారమ్ మెంబర్ షిప్ ధరను రూ.200 తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఇతర మెంబర్ షిప్ ప్లాన్ ల ధరల్లో ఎలాంటి మార్పు లేనట్టు తెలిపింది.

ఏమేం మారాయంటే..

ప్రైమ్ లైట్ మెంబర్ షిప్ వల్ల యూజర్స్ అనేక ప్రయోజనాలను అందుకుంటున్నారు. ఈ ప్లాన్ ను మరింత చౌకగా అందించేందుకు కంపెనీ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ధరతోపాటు ప్లాన్ లో కనిపించే మార్పుల విషయానికొస్తే..
ఉదాహరణకు, ముందుగా ప్లాన్‌లో రెండు రోజుల డెలివరీని ఉచితంగా అందించేవారు. ఇప్పుడు, ప్లాన్‌లో వన్-డే డెలివరీ, టూ-డే డెలివరీ, షెడ్యూల్డ్ డెలివరీ, సేమ్-డే డెలివరీ ఉన్నాయి.

ఇక ప్రైమ్ వీడియో క్వాలిటీని హెచ్ డీ కి పరిమితం చేయగా.. తాజా ధర తగ్గింపు వల్ల ఈ మెంబర్ షిప్ కేవలం ఒక యూజర్ కి మాత్రమే సపోర్ట్ చేయనుంది. ఇందులో భాగంగా ప్రతి వస్తువుపై రూ.175తో మార్నింగ్ డెలివరీ, నో-కాస్ట్ ఈఎంఐ, 6నెలల ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ వంటివి చాలానే ఉన్నాయి. అయితే ఈ ప్లాన్ వల్ల అన్ లిమిటెడ్ ప్రైమ్ వీడియో డివైజ్ సపోర్ట్ తో పాటు, 4కె రిజల్యూషన్ సపోర్ట్ ను కూడా యూజర్స్ కోల్పోనున్నారు.