హైదరాబాద్, వెలుగు: బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఏటా 32.5 కోట్ల లీటర్ల నీటిని ఆదా చేసేందుకు అమెజాన్ ఇండియా, నెటాఫిమ్ సంస్థలు చేతులు కలిపాయి. 120 హెక్టార్లలో బిందు సేద్యం ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా సుమారు 110 మంది రైతులకు మేలు జరుగుతుంది.
సంప్రదాయ పద్ధతికి బదులుగా బిందు సేద్యం చేయటం వల్ల నీటి వృథా తగ్గుతుంది. 2027 నాటికి వాటర్ పాజిటివ్‌గా మారాలనే లక్ష్యంలో భాగంగా అమెజాన్ ఈ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం భారత్‌లో ఇప్పటివరకు రూ.42 కోట్లు పెట్టుబడి పెట్టింది. బెంగళూరులో 80 హెక్టార్ల టమాటా తోటల్లో, హైదరాబాద్ లో 40 హెక్టార్ల మొక్కజొన్న తోటల్లో ఈ ప్రాజెక్టులు అమలు చేస్తారు.
