రూ.2 వేల 800 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న అమెజాన్

రూ.2 వేల 800 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న అమెజాన్

హైదరాబాద్​, వెలుగు: అమెజాన్ ఇండియా తన కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు రూ.2,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. అసోసియేట్ల సంక్షేమం, సామాజిక భద్రతా ప్రయోజనాల కోసం ఈ నిధులను ఖర్చు చేయనుంది. ప్రాజెక్ట్ ఆశ్రయ్ ద్వారా బీమాను మెరుగుపరచడంతో పాటు లక్షలాది మందికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోనుంది. 2030 నాటికి భారత్‌‌లో మొత్తం 35 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.90 లక్షలు కోట్లు) పెట్టుబడి పెట్టాలనే లక్ష్యంలో ఇది ఒక భాగం.  

జులైలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ ఏడాది జులైలో జరగనుంది. ఎలక్ట్రానిక్స్, కిచెన్, బ్యూటీ, ఫ్యాషన్, నిత్యావసర వస్తువులపై భారీ ఆఫర్లు ఉంటాయని సంస్థ ప్రకటించింది. భారత్‌‌లో ఇది పదో ప్రైమ్ డే వేడుక. గతేడాది 55 కోట్ల ఉత్పత్తులను అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ చేశామని తెలిపింది. 

ఎంపిక చేసిన నగరాల్లో అమెజాన్ నౌ ద్వారా నిమిషాల్లో డెలివరీ ఇస్తోంది. ప్రైమ్ సభ్యులకు ఉచిత డెలివరీ, ఎక్స్​క్లూజివ్ డీల్స్,  వీడియో,  మ్యూజిక్ సేవలు అందుబాటులో ఉంటాయి.