
హైదరాబాద్, వెలుగు: అమెజాన్ బిజినెస్ తన గ్రేట్ సమ్మర్ సేల్‌లో వ్యాపార కస్టమర్ల కోసం ప్రత్యేకమైన డీల్స్‌ను, ఆఫర్లను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సేల్‌లో బోట్, జేబీఎల్, డైకిన్, బాష్, హెచ్‌పీ, శామ్‌సంగ్, సింఫనీ వంటి బ్రాండ్లకు చెందిన రెండు లక్షలకు పైగా ఉత్పత్తులపై 70శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఆఫీస్ ఫర్నిచర్, కిచెన్ ఉపకరణాలు, పారిశ్రామిక సరఫరాలపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ బిజినెస్ డైరెక్టర్ మిత్రంజన్ భాదురి మాట్లాడుతూ పెద్ద మొత్తం ఆర్డర్‌లపై అదనపు డిస్కౌంట్లు ఇస్తామని, దేశవ్యాప్తంగా డెలివరీ చేస్తామని చెప్పారు. జీఎస్టీ ఇన్వాయిస్‌ల ద్వారా 28శాతం వరకు ఆదా చేసుకోవచ్చని అన్నారు. ఆఫీస్ కుర్చీలపై 80శాతం వరకు, హెడ్‌ఫోన్‌లు స్పీకర్లపై 70శాతం వరకు, ఏసీలపై 60శాతం వరకు, ల్యాప్‌టాప్‌లపై 50శాతం తగ్గింపులు ఉన్నాయని అన్నారు.