బ్రెజిల్‌లో ప్లేన్ కూలి 14 మంది మృతి

బ్రెజిల్‌లో ప్లేన్ కూలి 14 మంది మృతి

రియో డి జనీరో : బ్రెజిల్‌‌లోని అమెజాన్‌‌ అడవిలో శనివారం  ఓ ప్లేన్ క్రాష్ అయ్యింది. ఈ ప్రమాదంలో  పద్నాలుగు మంది చనిపోయారు. మృతిచెందిన వారిలో 12 మంది ప్యాసింజర్లు ..మరో  ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విషయాన్ని అమెజానాస్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా  వెల్లడించారు. ఎంబ్రేయర్ సంస్థకు చెందిన ఈఎంబీ~110 అనే చిన్న విమానం అమెజానాస్ స్టేట్ రాజధాని మనౌస్ నుంచి బార్సిలోస్‌‌కు బయలుదేరిందని తెలిపారు. 90 నిమిషాల ప్రయాణం తర్వాత బార్సిలోస్‌‌ ఏరియాలో  విమానం ఒక్కసారిగా కుప్పకూలిందని చెప్పారు.  తుఫాను ప్రభావంతో  కురుస్తున్న భారీ వర్షం వల్ల పైలట్ కు బార్సిలోస్‌‌ రన్‌‌వే సరిగ్గా కనిపించలేదని.. అయినా ల్యాండింగ్ కు ప్రయత్నించినందువల్లే ప్రమాదం జరిగిందని వివరించారు. స్థానిక బిజినెస్ మెన్ ఒకరు తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ విమానాన్ని అద్దెకు తీసుకున్నారని వెల్లడించారు. 

సరదాగా చేపలు పట్టడానికి వారంతా అందులో బార్సిలోస్‌‌కు వెళుతున్నారని తెలిపారు. వాతావరణం అనుకూలించక ప్లేన్ ప్రమాదానికి గురయ్యిందని పేర్కొన్నారు. భారీ వర్షం వల్ల బార్సిలోస్‌‌లో విమానాల ల్యాండింగ్ వీలుకావడం లేదు. ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం  రెండు విమానాలను తిరిగి 
వెనక్కి పంపాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.