బిగ్ బజార్, పాం టలూన్స్, బ్రాండ్ ఫ్యాక్టరీ, హెరిటేజ్ తదితర సంస్థలను నిర్వహించే కిశోర్ బియానీకి చెం దిన ఫ్యూచర్ రిటైల్ లో ప్రఖ్యాత ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 9.5 శాతం వాటా కొననుం ది. ఈ ఒప్పం దం విలువ దాదాపు రూ.2,500 కోట్లు ఉంటుం దని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్ పీఐ) విధానంలో ఒప్పం దం ఖరారవుతుంది. ఇందుకోసం టెర్మ్‌షీట్‌పై ఇరు వర్గాలూ సంతకాలు చేశాయి. ఈ నెల 14న బోర్డు అనుమతి తీసుకున్నాక, ఒప్పం దం గురించి
లాం ఛనంగా ప్రకటిస్తారు . దేశవ్యాప్తంగా ఫ్యూచర్ రిటైల్ కు వెయ్యికి పైగా ఆఫ్ లైన్ స్టోర్లు ఉన్నాయి. ఒప్పం దం గురించి స్పందిం చడానికి అమెజాన్ గానీ ఫ్యూచర్ రిటైల్ ప్రతినిధులు గానీ అంగీకరిం చలేదు. వాటా అమ్మకం కోసం ఫ్యూచర్ రిటైల్ అధిపతి కిశోర్ బియానీ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ను అమెరికా నగరం సియాటెల్ లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఈ ఏడాది జనవరిలో కలుసుకున్నారు. తదనంతరం ఇరు కంపెనీ ల ప్రతినిధులు ఇండియాలో, అమెరికాలో చర్చలు జరిపారు. అమెజాన్ మన దేశంలో ఎఫ్ పీఐగా నమోదయింది.
ఇక్కడి నిబంధనల ప్రకారం మల్టీ బ్రాండ్ రిటైల్ విభాగంలో విదేశీ కంపెనీ లు గరిష్టం గా 51 శాతం వాటాకొనొచ్చు. ఒక కంపెనీ లో వాటా 10 శాతానికి మించకూడదు. గత ఏడాది ఎఫ్ పీఐ విధానంలో అమెజాన్ షాపర్స్‌స్టా ప్ లో ఐదుశాతం వాటా దక్కిం చుకుం ది. ఆదిత్య బిర్లా రిటైల్ కు చెం దిన‘మోర్ సూపర్‌మార్కె ట్స్’లో రెం డు నెలల క్రితం సమర క్యాపి టల్ తోపాటు వాటా కొన్నది. ఆహార, కిరా ణా సామగ్రి వ్యాపారం కోసం 500 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,650 కోట్లు) పెట్టుబడి పెట్టాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెం డా ఊపింది. కిరాణా సామగ్రి విక్రయం కోసం ఉద్దేశించి న అమెజాన్ పాంట్రీ, అమెజాన్ నౌ విస్తరణ కోసం ఈ డబ్బును ఉపయోగిస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. బియానీ సైతం గత ఆరేళ్లలో ఏకంగా ఏడు సూపర్‌మార్కెట్ చైన్లను కొనేశారు. ఇప్పుడు ఫ్యూచర్ గ్రూపునకు దేశవ్యాప్తంగా 340 నగరాల్ లో స్టోర్లు ఉన్నాయి. ఆహారం,కిరాణా వ్యాపా రం మనదేశంలో వేగంగా వృద్ధి చెం దుతోం ది. రిటైల్ అమ్మకాల్లో ఈ రెండింటి వాటాయే 12.5 శాతం వరకు ఉంటుం ది.అందుకే అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీ లు ఈ రంగంలోకి వస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ ఇప్పటి కే సూపర్‌మార్ట్ పేరుతో కిరా ణ వస్తువులు అమ్ముతోం ది
