రిలయన్సా మజాకా: గ్లోబల్ గా దూస్కెళ్తున్న అంబానీ

రిలయన్సా మజాకా: గ్లోబల్ గా దూస్కెళ్తున్న అంబానీ

అతిపెద్ద ఇథేన్ షిప్స్‌ ను ఆపరేట్ చేసే 6 కంపెనీల్లో వాటాలను రిలయన్స్ అమ్మేస్తోంది.జపాన్‌‌కు చెందిన షిప్పింగ్ గ్రూప్ మిట్సుయీ ఓఎస్‌ కే లైన్స్(ఎంఓఎల్‌ )కు ఈ వాటాలను అమ్మేస్తున్నట్టు రిలయన్స్ తెలిపింది. తమ సింగపూర్ సబ్సిడరీ రిలయన్స్ ఇథేన్ హోల్డింగ్ పీటీఈ లిమిటెడ్(ఆర్‌‌‌‌ఈహెచ్‌ పీఎల్), ఎంఓఎల్‌ తో ఇన్వెస్ట్‌‌మెంట్ డీల్‌ కుదుర్చుకున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. లిమిటెడ్ లయబులిటీ కంపెనీల్లో (ఎల్‌ ఎల్‌ సీ లు) రిలయన్స్‌ కు 100 శాతం వాటా ఉంది. ఎల్‌ ఎల్‌ సీ లు అతిపెద్ద ఇథేన్ క్యారియర్స్‌ ను(వీఎల్‌ ఈసీఎస్) ఆపరేట్ చేస్తున్నాయి. ఆరు లిమిటెడ్ లయబులిటీ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ కు ఉన్న వాటాలను కొనేందుకు మిట్సుయీ ఓఎస్‌ కే, ఓ మైనార్టీ ఇన్వెస్టర్‌‌‌‌ ఒప్పందం కుదుర్చుకున్నారని రిలయన్స్ తెలిపింది. అయితే ఈ డీల్ విలువను మాత్రం రిలయన్స్ బహిర్గతం చేయలేదు.

రెగ్యులేటరీ ఆమోదం మేరకు లావాదేవీ ముగింపు ఉంటుందని పేర్కొంది. లావాదేవీ ముగిశాక, ఈ క్యారియర్స్‌ను ఆర్‌‌‌‌ఈహెచ్‌ పీఎల్, ఎంఓఎల్‌ లు కలిసి సంయుక్తంగా నియంత్రిస్తాయి. ‘ఆరు అతిపెద్ద ఇథేన్ క్యారియర్స్‌ ను ఇక ఎంఓఎల్‌ కూడా ఆపరేట్ చేస్తుంది. ఎంఓఎల్‌ పెట్టుబడితో మా బంధం మరింత బలోపేతమైంది. అతిపెద్ద ఇథేన్ క్యారియర్స్‌ ను సమర్థవంతంగా, సురక్షితంగా ఆపరేట్ చేస్తాం. ఈ స్పెషల్ వెహికిల్స్‌ లో కి వ్యూహాత్మక భాగస్వామిగా ఎంఓఎల్‌ ను ఆహ్వానిస్తున్నాం’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటి వ్ డైరెక్టర్ పీ.ఎం.ఎస్ ప్రసాద్ తెలిపారు.

ఐకానిక్ టాయ్ కంపెనీ రిలయన్స్ చేతికి….

అటు మిట్సుయీ కంపెనీకి షిప్స్ కంపెనీల్లో వాటాలు అమ్మేసిన రిలయన్స్… ఇటు ఐకానిక్ బ్రిటీష్ టాయ్ రిటైలర్‌‌‌‌ను చేజిక్కించుకోబోతోంది. త్వరలోనే బ్రిటీష్‌‌కు చెందిన టాయ్ కంపెనీ హామ్లేస్‌ , ఇండియన్ చే తుల్లోకి రాబోతుందని తెలిసింది. హామ్లేస్ ప్రపంచంలోనే అతిపురాతనమైన, అతిపెద్ద టాయ్ షాపు. టాయ్స్ రిటైలర్లలో ప్రపంచంలోనే ఎంతో పేరు కలది ఈ కంపెనీ. 259 ఏళ్ల క్రితం అంటే 1760లోనే హామ్లేస్‌ తన జర్నీని ప్రారంభించింది. లండన్‌‌లో ని రీజెంట్ స్ట్రీట్‌‌లో ఇది ఉంటుం ది. ప్రస్తుతం ఈ షాపును రిలయన్స్ రిటైలర్ కొంటున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ డీల్‌ కు సంబంధించి చర్చలు అడ్వాన్స్ స్టేజీలో ఉన్నాయని చెప్పారు . ఈ కొనుగోలుతో అంతర్జాతీయంగా రిలయన్స్ రిటైల్ తనదైన ముద్ర వేయాలని చూస్తోంది. వచ్చే దశాబ్దంలో ప్రతేడాది 30 శాతం పెరుగుదలను నమోదు చేయాలని రిలయన్స్ రిటైల్ లక్ష్యంగా పెట్టుకుంది. రిలయన్స్ రిటైల్‌ ను నడిపించే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌‌ ఇప్పటికే ఇండియాలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీగా ఉంది.

రాజకుటుంబీకులు హామ్లేస్ కస్టమర్లే….

సౌదీ అరేబియాకు చెందిన రాజ కుటుం బీకులు కూడా హామ్లేస్‌ కు ప్రత్యేక కస్టమర్లు. కానీ ఇటీవల బ్రెగ్జిట్ విషయంలో అనిశ్చితి చోటు చేసుకోవడంతో,యూకే కస్టమర్లలో విశ్వాసం సన్నగిల్లింది. దీంతో హామ్లేస్ ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2017లో ఇది 1.2 కోట్ల పౌండ్ల నష్టాలను రిపోర్టు చేసింది. వార్షిక రెవెన్యూలు కూడా 2.5 శాతం తగ్గాయి. అయినప్పటికీ ప్రపంచ టాయ్ ఇండస్ట్రీలో ఇదే లీడింగ్ ప్లేయర్. దీని ప్రత్యర్థులు టార్గెట్, వాల్‌ మార్ట్, అమెజాన్ వంటివి టాయ్ మార్కెట్‌‌లో హామ్లేస్‌ కు గట్టి పోటీ ఇస్తున్నాయి.

ఒకవేళ ఈ కొనుగోలు విజయవంతమైతే, రిలయన్స్ రిటైల్ తన పోర్ట్‌‌ఫోలియోను పెంచుకోవడానికి హామ్లేస్‌ ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొ న్నాయి. సప్లయ్ చైన్ మేనే జ్‌ మెంట్, బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌‌వర్క్‌‌లో తమ సామర్థ్యాలతో హామ్లేస్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ మరింత పైకి తీసుకెళ్లగలదని తెలిపాయి. అయితే ఈ విషయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి స్పందించలేదు. రిలయన్స్ రిటైల్ ఇప్పటికే ప్యాన్ ఇండియా బేసిస్‌ లో హామ్లేస్‌ తోఫ్రాంచైజ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది.

హామ్లేస్‌ కు గ్లోబల్‌ గా 129 స్టోర్లున్నాయి. వీటిలో ఎక్కువగాఫ్రాంచైజ్‌ మోడల్సే. యూకే బయట చైనా, జర్మనీ,రష్యా, ఇండియా, సౌతాఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇతర ప్రాంతాల్లో కంపెనీ తన కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ డీల్‌ తో రిలయన్స్ రిటైల్ ఇండియాలో కూడా హామ్లేస్‌ వ్యాపారాలను మరింత పెంచనుంది. ప్రస్తుతం హామ్లేస్‌ కు ఇండియాలో సుమారు 50 స్టోర్లున్నాయి. వీటిని వచ్చే మూడేళ్లలో 200 వరకు చేర్చాలని ప్లాన్‌‌లో ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2015లో హామ్లేస్‌ ను సీబ్యానర్ ఇంటర్నేషనల్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం సీ బ్యానర్ పొటెన్షియల్ బయర్స్‌ ను వెతకడం ప్రారంభించిందని స్కైన్యూస్ రిపోర్టు చేసింది. రిలయన్స్ రిటైల్ తో డీల్‌ కనుక సక్సెస్ అయితే, హామ్లేస్ చేతులు మారడం ఇది నాలుగోసారి అవుతోం ది.

రిలయన్స్ రిటైల్ ఒప్పందాలు..

రిలయన్స్ రిటైల్ చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్లతో ఒప్పం దాలు కుదుర్చుకుం ది. వాటిలో డీజిల్, మార్క్స్ అండ్ స్పెన్సార్స్, స్టీవ్ మ్యాడెన్, కెన్నెథ్ కోల్ ఉన్నాయి. రిలయన్స్ రిటైల్ 6400కు పైగా నగరాల్లో 9,907 స్టోర్లను ఆపరేట్ చేస్తోంది.

రిఫైనరీ, పెట్రోకెమికల్స్‌‌లో 25% వాటా కావాలి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ రిఫైనరీలు, పెట్రోకెమికల్స్‌ వ్యాపారాల్లో వాటాలను కొనేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఎగుమతిదారి సౌదీ ఆరామ్‌ కో చర్చలు జరుపుతోంది. కొన్ని నెలల నుంచి రిలయన్స్‌ తో ఆరామ్‌ కో ఈ చర్చలు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిపోర్టుల ప్రకారం ఆరామ్‌ కో 25 శాతం వాటాలను 10 బిలియన్ డాలర్ల నుంచి 15 బిలియన్ డాలర్ల మధ్యలో కొనుగోలు చేస్తోందని తెలుస్తోంది. రిలయన్స్‌ కు రిఫైనరీ, పెట్రోకెమికల్ బిజినెస్‌ ల నుంచే రూ.4.25 లక్షల కోట్లు వస్తున్నాయి.