చంద్రబాబుకు ఎందుకంత ఫ్రస్ట్రేషన్ : అంబటి రాంబాబు

చంద్రబాబుకు ఎందుకంత ఫ్రస్ట్రేషన్ : అంబటి రాంబాబు

ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేకనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నానా యాగి చేస్తున్నారని విమర్శించారు YSRCP రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… పోలీంగ్ తర్వాత బాబు పరిస్థితి విచిత్రంగా మారిందని అన్నారు.  ఈవీఎం లపైనా, వీవీ ప్యాట్ లపైనా బాబు అనవసరంగా మాట్లాడుతున్నారని చెప్పారు. సుప్రీం కోర్టు మందలించినా తన వైఖరి మార్చుకోలేదని అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా.. మంచి పనోడు పని ముట్లపైనే తప్పును నెట్టడు అని… చురకలు అంటించారని అన్నారు.

2014 లో చంద్ర బాబు గెలిచినపుడు ఇవే ఈవీఎం లు ఉన్నాయని అన్నారు అంబటి. ఇప్పుడు మాత్రం ఈవీఎం లు సరిగ్గా సనిచేయడం లేదని బాబు అనడం విడ్డూరం అని చెప్పారు. ఓటమి తప్పదని తెలిసి టీడీపీ వర్గాలు కౌంటింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు చేయడానికి రెడీ అవుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయడం ఓ పిచ్చి చర్యగా అభివర్ణించారు అంబటి. సూప్రీం కోర్టు చెప్పినా ధర్నా చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమే ఆయన అన్నారు. ఓడిపోయే పరిస్థితి వచ్చినపుడు హుందాగా ఉండకుండా ఇలాంటి చర్యలు చేసి మరింత దిగజారుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఫుల్ ఫిల్ చేయగలిగే కూటమికి మాత్రమే YSRCP మద్ధతు ఇస్తుందని చెప్పారు.