చంద్రబాబు దత్తత పుత్రుడు పవన్ కళ్యాణ్ : అంబటి

చంద్రబాబు దత్తత పుత్రుడు పవన్ కళ్యాణ్ : అంబటి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పుత్రుడు మంగళగిరిలో ఓడిపోతే ఆయన దత్తత పుత్రుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడంటూ ఎద్దేవా చేశారు.రెండు చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారో తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డీఎన్ఏ ఒక్కటి కాబట్టి ఇద్దరు ఒకే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు మార్నింగ్ మాట్లాడింది.. పవన్ ఈవినింగ్ మాట్లాడుతున్నారని అన్నారు. కుప్పం ,మంగళగిరిలో జనసేన నుంచి ఎందుకు పోటీ చేయలేదన్నారు. చంద్రబాబును నమ్ముకొని పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తే ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. సొంతగా రాజకీయాలు చేస్తే పవన్ కళ్యాణ్ కు నాలుగు సీట్లు అయిన వస్తాయన్నారు అంబటి .

ఎవరికోసమే  పవన్ కళ్యాణ్ రాజకీయాలు చెయొద్దన్నారు అంబటి. ప్రకాశం జిల్లాలో వలసలు సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీలో వలసలు ఆపుకోవాలన్నారు.  జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. జగన్మోహన్ రెడ్డిపై కేసులు విచారణ జరుగుతుంటే నేరస్తుడు అని ఎలా అంటారని అన్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు నేరస్తులు కాదన్నారు. వేల పుస్తకాలు చదివానంటున్న పవన కళ్యాణ్ కు ఆ సంగతి తెలియదా? అని ప్రశ్నించారు అంబటి.