- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
గోదావరిఖని, వెలుగు: డాక్టర్బీఆర్అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రామగుండంలో త్వరలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ టి.జంక్షన్ వద్ద మంగళవారం నిర్వహించిన అంబేద్కర్ జయంత్యుత్సవాలకు ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
ఈ సంధర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుపేద అభ్యర్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌ను అన్ని వసతులతో త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే మాట్లాడుతూ సిమ్స్ వైద్య కాలేజీకి వెళ్లే దారిలో సింగరేణి ఆధీనంలో ఉన్న నిరుపయోగ స్థలాన్ని స్వాధీనం చేసుకుని అంబేద్కర్ పార్క్ అభివృద్ధి చేస్తున్నామన్నారు.

