కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి..అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రిక్వెస్ట్

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి..అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రిక్వెస్ట్
  • మంత్రి అడ్లూరికి పరశురామ్ వినతి

హైదరాబాద్, వెలుగు: కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డా జేరిపోతుల పరశురామ్ కోరారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రిక్వెస్ట్​చేశారు. 

నవంబర్ 26న  భారత రాజ్యాంగం ఆమోదించిన సందర్భంగా కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలన్నారు. అదే రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద  వేలాది మంది కళాకారులచే  ధూంధాం నిర్వహిస్తున్నామని తెలిపారు. పరశురామ్​ వెంట దాసరి విజయ్ కుమార్ ఉన్నారు.