రోషిబినాకు పతకం ఖాయం

రోషిబినాకు పతకం ఖాయం

ఇండియా ఉషు ప్లేయర్‌‌‌‌ నౌరమ్‌‌‌‌ రోషిబినా దేవి ఆసియా క్రీడల్లో కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌ 60 కేజీల సెమీఫైనల్లో రోషిబినా 2-0 తేడాతో థానియా కుసుమసానింగస్‌‌‌‌ (ఇండోనేసియా)పై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. మెన్స్‌‌‌‌ 80 కేజీల విభాగం ప్రిక్వార్టర్స్‌‌‌‌లో అంకుష్‌‌‌‌ 5‌‌-0తో హమ్సా వోగెల్‌‌‌‌ (బహ్రెయిన్‌‌‌‌)పై నెగ్గాడు. మరోవైపు ఆసియా క్రీడల ఫెన్సింగ్‌‌‌‌లో ఇండియా ప్లేయర్ల పోరాటం ముగిసింది. 

బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌ వ్యక్తిగత సేబర్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గిషో నిధి కుమారేసన్ పద్మ 11-15 తేడాతో  ఆర్టోమ్‌‌‌‌ సరికిస్యాన్ (కజకిస్తాన్‌‌‌‌) చేతిలో ఓడాడు. కరణ్ సింగ్ 14-15 తేడాతో లువో షావోటాంగ్ (చైనా) చేతిలో, విమెన్స్‌‌‌‌లో మీనా దేవి 3-15తో పార్క్‌‌‌‌ జిహీ (కొరియా), అషితా 14-15తో అలోనా (కజకిస్తాన్‌‌‌‌) చేతిలో కంగుతిన్నారు.