బిహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి..RJD నేత తేజస్వి యాదవ్

బిహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి..RJD నేత  తేజస్వి యాదవ్
  • బీజేపీ కోసమే  సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ​పనిచేస్తున్నారు: తేజస్వి

పాట్నా: బిహార్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని, రెండు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం పాట్నాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పనిచేస్తున్నారని ఆరోపించారు. 

బిహార్, బెంగాల్‌‌‌‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలుపునకు ఆయనే కారణమని విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను బీజేపీ సెల్స్‌‌‌‌లా మారుస్తున్నారని ఫైర్​అయ్యారు. అయితే సర్​కు సంబంధించిన నిర్ణయాలన్నీ ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఆమోదంతోనే ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.