
అంబర్ పేటలో మరో విద్యుత్ షాక్ఘటన జరిగింది. నిన్న ( ఆగస్టు 18) రామంతాపూర్ లో జరిగిన విద్యుత్ షాక్ ఘటన తేరుకోకముందే మరో ఘటన జరిగింది. రెండు రోజుల్లో మూడువిద్యుత్ షాక్ ఘటనలు జరిగాయి.
వినాయకచవితి పండుగ దగ్గర పడుతుంది. నగరంలో యూత్ ఆయా కాలనీల్లో వినాయకుని మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. అంబర్ పేటలో ఓ వీధిలో వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా.. విద్యుత్ తీగలు అడ్డుగా ఉన్నాయి. వీటిని కట్టెతో పైకి లేపి మండపం.. ఏర్పాటు చేస్తుండగా.. రామ్ చరణ్ అనే వ్యక్తికి విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. ఈ ఘటనలో చరణ్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
పాతబస్తీ బండ్లగూడలో మరో ఘటన
హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడ రోడ్డు లో గణేష్ విగ్రహాన్ని మండపానికి తరలిస్తుండగా జరిగింది ఈ ఘటన. విగ్రహాన్ని తరలిస్తున్న సమయంలో కొంతమందికి విద్యుత్ షాక్ తగిలి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఒవైసీ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అఖిల్, వికాస్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుని పరిస్థితి చాలా విషమంగా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు బండ్లగూడ పోలీసులు.