భద్రాచలం, వెలుగు: మద్యం మత్తులో వాహనం నడిపి యాక్సిడెంట్ చేయడంతో ఇద్దరు మృతిచెందిన కేసులో అంబులెన్స్ డ్రైవర్‌కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. భద్రాచలానికి చెందిన తోట వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి 2020 జనవరి 1న పాములేరు విహారయాత్రకు వెళ్లి స్కూటీపై తిరిగి వస్తుండగా అంబులెన్స్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆయన కుమార్తె తోట చంద్రకళ (28), మనుమరాలు వడ్డే శ్రీలాస్య(5) మృతిచెందారు. అంబులెన్స్ డ్రైవర్ఆకుల దుర్గాప్రసాద్ మద్యం సేవించినట్లు స్థానికులు గుర్తించారు. నేరం రుజువు కావడంతో డ్రైవర్‌కు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
