- అంబులెన్స్‌నే మొబైల్ లైబ్రరీగా మార్చింది
- సర్కారీ బడుల స్టూడెంట్స్ కోసం బుక్స్ కలెక్షన్
- ‘స్టోరీస్ ఆన్ వీల్స్’ పేరుతో లైబ్రరీ సర్వీస్
- 12వ తరగతి స్టూడెంట్ అనన్య పొల్సాని ఐడియా అదుర్స్
హైదరాబాద్‌కు చెందిన ఓ స్టూడెంట్ ప్రభుత్వ బడుల స్టూడెంట్లకు లైబ్రరీ సర్వీస్ అందించడానికి కొత్తగా ఆలోచించింది. వారి కోసం కథలు, కార్టూన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, పురాణ, ఇతిహాస పుస్తకాలను సేకరిస్తూ ‘‘ స్టోరీ ఆన్ వీల్స్”ను రూపుదిద్దింది. సిటీలోని చిరాగ్ పబ్లిక్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న అనన్య పొల్సాని ఒక పాత అంబులెన్స్ వ్యాన్ తీసుకుని దాన్ని మొబైల్ లైబ్రరీగా మార్చేసింది.
‘మిలాప్’ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం సహకారంతో మరికొన్ని పుస్తకాలు కొనుగోలు చేసింది. అదే విధంగా ల్యాప్‌టాప్‌లు, క్రీడా సామగ్రిని కూడా సేకరిస్తోంది. నగర వ్యాప్తంగా భారీగా పుస్తకాల సేకరణకు ఆదివారం మాదాపూర్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్ చేపట్టింది. ఇక్కడి ఫార్చ్యూన్ టవర్స్ వాసులు 500 పుస్తకాలను డొనేట్ చేశారని అనన్య తెలిపింది.
తమ బుక్ డ్రైవ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని హ్యాపీగా చెప్పింది. ఈ డ్రైవ్ మరో 4 రోజుల పాటు సిటీలోని పలు గేటెడ్ కమ్యూనిటీల్లో నిర్వహిస్తామంది. 17న మీనాక్షి ట్రైడెంట్, 18న రాంకీ టవర్స్, 19న టెజెండ్ చైమ్స్, 20న రాజ్‌పుష్పలలో జరుగుతుందని పేర్కొంది. సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామని, వీలైనంత ఎక్కువ మంది స్టూడెంట్లకు తమ సర్వీస్ అందించాలనేదే తమ టార్గెట్ అని తెలిపింది. వారం రోజుల పాటు ఒక్కో స్కూల్ దగ్గర వ్యాన్ ఉంచి, అక్కడి స్టూటెండ్లకు ఉచితంగా స్టోరీ బుక్స్ అందిస్తామంది.
