మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. తాగిన మత్తులో ట్రాన్స్ ఫార్మర్ పట్టుకొని విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు. బుధవారం ( సెప్టెంబర్ 2 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... మాదాపూర్ పోలీస్ స్టేషన్ లోని సిద్ధిక్ నగర్ లో తాగిన మత్తులో ట్రాన్స్ ఫార్మర్ పట్టుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు పోలీసులు. చనిపోయిన వ్యక్తికి సుమారు 40 ఏళ్ళు ఉండచ్చని అంటున్నారు పోలీసులు.మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు. వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలు, తీగలకు ముట్టుకోకూడదని.. ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. రోడ్డు మీద నడిచే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.
