2026 సంవత్సరంలో ప్రపంచం చూసిన అత్యంత పెను విషాదం నేపాల్ ఆకస్మిక వరదలు. ఈ జల ప్రళయం ధాటికి.. 12 వందల మందికి పైగా చనిపోయారు. నేపాల్ వరదలు బీభత్సం సృష్టించి దాదాపు వారం గడిచింది. ఇప్పటికీ ఈ వరదల్లో గల్లంతయిన దాదాపు 5 వేల మంది ఆచూకీ దొరకలేదు. అలా ఆగస్ట్ 26, 2026న సంభవించిన నేపాల్ వరదల్లో గల్లంతయిన వాళ్లలో తల్కా సదా అనే ఈ వ్యక్తి కొడుకు వినోద్ కూడా ఒకరు. కొడుకు కోసం వెతికీ వెతికీ ఈ తండ్రి కళ్లు అలసిపోయాయి.
ఒంట్లో సత్తువ లేదు. నిలబడేంత ఓపిక లేదు. కానీ.. కన్న కొడుకు కోసం ఈ తండ్రి అన్వేషణ వారం నుంచి కొనసాగుతూనే ఉంది. కొడుకు జాడ కోసం నేపాల్ పర్వతాల మీదుగా ఎన్నో మైళ్ళు నడిచాడు. అతని మడమలు నొప్పిగా ఉన్నాయి. అతనికి ఆకలిగా, కోపంగా ఉంది. కొడుకు కనిపించలేదనే బాధ, ఆవేదన ఉంది. ఆశలు సన్నగిల్లితున్నాయి. నిస్సహాయత, నిరాశ కమ్మేస్తున్నాయి. అయినా.. తన కొడుకు ఎక్కడో ఒక దగ్గర బతికే ఉంటాడన్న చిన్న ఆశ అతనిది. ‘‘నాన్నా’’ అని పిలవకపోతాడా అనే ఆశనే అతని అడుగులు ముందుకు పడేలా చేస్తుంది.
50 ఏళ్ల వయసులో కొడుకు కోసం కొండలు, గుట్టలు ఎక్కుతూ వెతుకులాట సాగిస్తున్న.. తల్కా సదా సొంతూరు నేపాల్‌లోని టెరాయ్ ప్రాంతంలోని సప్తరి జిల్లా. ఈ టెరాయ్ ప్రాంతం దక్షిణ నేపాల్ అంతటా, శివాలిక్ కొండలకు దక్షిణంగా, భారతదేశంతో ఉన్న సులభంగా దాటగల సరిహద్దుకు ఉత్తరంగా విస్తరించి ఉన్న మైదాన ప్రాంతం. హిమాలయాల్లో నివసించే ఈ ప్రాంత ప్రజలను మధేసీలు అని పిలుస్తారు. సదాకు ముగ్గురు కూతుర్లు కూడా ఉన్నారు. అతని కొడుకు వినోద్ వయసు 19 సంవత్సరాలు.
►ALSO READ | ఇరాన్‌కు రష్యా స్రీకెట్ హెల్ప్.. అమెరికా యుద్ధ నౌకలే టార్గెట్‌గా మిస్సైల్స్ తయారీ..!
భోటేకోశి నదికి వచ్చిన వరదలకు ఒక రోజు ముందు సదా 19 ఏళ్ల తన కొడుకు వినోద్‌తో చివరిసారిగా మాట్లాడారు. వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతమైన రసువా జిల్లాకు వినోద్ నెల క్రితం జల విద్యుత్ ప్లాంట్‌లో కూలీగా పని చేయడానికి వెళ్లాడు. కన్న కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి తన భార్య శోక సంద్రంలో ఉందని, తాను కూడా ఎంత బాధలో ఉన్నానో చెప్పలేనని.. ఏం చేయాలో కూడా తెలియడం లేదని సదా.. కొడుకును తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యాడు.
సదా తన జేబులో ఉన్న ఒక మట్టి కొట్టుకుపోయి ఉన్న రుమాలును చూపించాడు. ఆ కర్ఛీఫ్లో 2 వేల నేపాలీ రూపాయల కన్నా తక్కువ విలువ ఉన్న నోట్లు నలిగిపోయి ఉన్నాయి. తన కొడుకును వెతుక్కుంటూ.. నేపాల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరగడానికి అతను అప్పుగా తీసుకున్న డబ్బు అది.
ఈ అప్పు గురించి మాట్లాడుతూ.. "సప్తరి నుంచి ఇక్కడి వరకు రావడానికి నేను అప్పు తీసుకున్నాను. నేను అప్పుగా తీసుకున్న ప్రతి 100 రూపాయలకు 20 రూపాయల వడ్డీ చెల్లించాలి" అని సదా చెప్పాడు. సదాతో పాటు ఆయన సోదరుడు కూడా ఉన్నాడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఆ డబ్బులో కొంత మొత్తాన్ని సప్తరి నుంచి నేపాల్ రాజధాని నగరం అయిన ఖాట్మండుకు బస్సులో వెళ్ళడానికి ఉపయోగించారు.
నేపాల్ కొండ ప్రాంతం కావడం వల్ల, 292 కిలోమీటర్ల (181 మైళ్ల) ప్రయాణానికి తొమ్మిది గంటల సమయం పట్టింది. తల్కా సదా అన్వేషణ ఫలించి కన్న కొడుకు ఆయనకు ప్రాణాలతో దక్కాలని ఆయన దయనీయ స్థితి చూసిన వాళ్లంతా దేవుణ్ణి ప్రార్థించారు.
