పాక్ పై ఎయిర్ స్ట్రైక్ సరైన పని: భారత్ కు యూఎస్ సపోర్ట్

పాక్ పై ఎయిర్ స్ట్రైక్ సరైన పని: భారత్ కు యూఎస్ సపోర్ట్
  • అజిత దోవల్ తో ఫోన్ లో మాట్లాడిన అమెరికా విదేశాంగ మంత్రి

వాషింగ్టన్: పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ లోని జైషే ఉగ్ర క్యాంపులపై భారత్ అటాక్ చేయడాన్ని అమెరికా సమర్థించింది. నిన్న అర్ధరాత్రి సమయంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పోంపియో ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సాహిస్తున్న పాక్ పై దాడికి ఆయన మద్దతు తెలిపారు. ఫిబ్రవరి 26న సరిహద్దు దాటి లోపలికి చొచ్చుకెళ్లి జైషే క్యాంపులపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించి దాదాపు 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం సరైన పని అని మైక్ అన్నారు. ప్రస్తుతం భారత్ – పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల గురించి చర్చించారు.

ఏమైనా జరగొచ్చు: జైట్లీ

US can take Osama from Pakistan, then we can also do the same: Arun Jaitleyపాకిస్థాన్లోకి వెళ్లి బిన్ లాడెన్ ను అమెరికా నేవీ సీల్స్ హతమార్చినట్లుగా భారత్ చేస్తే తప్పేంటని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న ప్రశ్నించారు. భారత్ కూడా పాక్ లోకి చొచ్చుకెళ్లి మసూద్ అజార్ ను చంపేయొచ్చన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమైనా జరగొచ్చని చెప్పారు. ఈ క్రమంలో అమెరికా నుంచి భారత్ ఎయిర్ స్ట్రైక్ కు మద్దతు లభించడం గమనార్హం.