బెంగాల్‌‌లో ఎమర్జెన్సీకి అమిత్ షా కుట్ర పన్నుతున్నారు

బెంగాల్‌‌లో ఎమర్జెన్సీకి అమిత్ షా కుట్ర పన్నుతున్నారు

కోల్‌‌‌కతా: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్ పర్యటన వివాదాస్పదంగా మారింది. నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌‌పై కొందరు వ్యక్తులు రాళ్లదాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు త‌ృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే కారణమంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ స్పందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా . బెంగాల్‌‌లో ఎమర్జెన్సీ విధించాలని పరోక్షంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అందుకోసం ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్‌‌ను వాడుకుంటున్నారని విమర్శించారు.

నడ్డా కాన్వాయ్ మీద దాడి జరిగిన సమయంలో ఆయన కారుకు సమీపంలో వెళ్తున్న 50 మోటార్ సైకిళ్లు, 30 కార్లపై బీజేపీ జెండాలు ఉన్నాయని కల్యాణ్ తెలిపారు. బెంగాల్‌‌పై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ అనుకుంటోందన్నారు. భారత రాజ్యాంగంలో భాగమైన ఫెడరల్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని అనవసర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.