మరోసారి మమ్ముట్టితో..

మరోసారి మమ్ముట్టితో..

తమిళనాట లేడీ సూపర్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దూసుకెళ్తున్న నయనతార.. మాతృభాష మలయాళంలోనూ అడపాదడపా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అక్కడ ‘డియర్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌’ అనే చిత్రంలో నటిస్తున్న ఆమె, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో నటించబోతోంది. మమ్ముట్టి హీరోగా నటించనున్న ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి మమ్ముట్టి నిర్మాతగా వ్యవహరించనున్నారు.

గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేయనున్న ఫస్ట్ మలయాళ సినిమా ఇదే కావడంతో ఆసక్తి నెలకొంది. ఇక ఇందులో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నయనతార నటించబోతోంది. ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి మమ్ముట్టితో ఆమె కలిసి నటించబోతోంది. గతంలో తస్కర వీరన్, భాస్కర్ ది రాస్కెల్, పుథియ నియమం లాంటి చిత్రాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఈసారి గౌతమ్ మీనన్ డైరెక్షన్ కావడంతో అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ నుంచే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.