శనివారం క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌ షూట్‌‌‌‌‌‌‌‌

శనివారం క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌  షూట్‌‌‌‌‌‌‌‌

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి కలిసి  నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్  శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో హ్యూజ్ క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్  కోసం  భారీ సెట్‌‌‌‌‌‌‌‌ను నిర్మించారు. ఇది  సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశం.

నానితో పాటు ముఖ్య పాత్రధారులంతా  ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో జాయిన్ అయ్యారు.  ఈ చిత్రంలో నాని రగ్గడ్ లుక్‌‌‌‌‌‌‌‌లో సూర్య అనే పాత్రను పోషిస్తున్నాడు.  ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. ఎస్‌‌‌‌‌‌‌‌జే సూర్య, సాయి కుమార్  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  సినిమా విడుదల కానుంది.