
బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. తను హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడి’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, ‘రాజా సాబ్’ షూటింగ్ జరుగుతోంది. సాలార్ 2, స్పిరిట్ చిత్రాలు సెట్స్‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. వీటిలో ముందుగా రాబోతున్న ‘కల్కి 2898 ఏడి’ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ మైథాలజీ ఇన్స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ పై దృష్టి పెడుతున్నారు. అతి త్వరలో వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేయబోతున్నారట. ఇందులో భాగంగా ఫ్యాన్స్ మీట్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం డై హార్డ్ ఫ్యాన్స్‌ను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పాన్ ఇండియా వైడ్‌గా ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు ‘సాలార్’ చిత్రంలో ప్రభాస్‌కు తక్కువ డైలాగ్స్ ఉండడంతో కొంత నిరాశ పడ్డారు అభిమానులు.
ఈసారి సీక్వెల్‌లో ప్రభాస్ పాత్రకు పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉండబోతున్నాయట. ఇందులో ఓ లెంగ్తీ డైలాగ్ ఉండబోతోందని, అభిమానులకు కిక్ ఇచ్చేలా ఉంటుందని సమాచారం.