బీజేపీ మీడియా కో ఆర్డినేటర్​పై కేసు

బీజేపీ మీడియా కో ఆర్డినేటర్​పై కేసు

పంజాగుట్ట, వెలుగు: పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన ఓటర్లకు బీజేపీకి ఓటు వేయాలని చెప్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రహమత్​నగర్​లోని న్యూటన్ హైస్కూల్​వద్ద పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పోలింగ్ జరుగుతుండగా, ఇక్కడి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న కూకట్​పల్లికి చెందిన బీజేపీ స్టేట్ మీడియా కో-ఆర్డినేటర్ విజ్జిత్ వర్మ తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లను కోరారని పోలీసులు తెలిపారు. తాను వెంగళరావు నగర్ డివిజన్ బీజేపీ ఇంచార్జీగా ఉన్నానని ఆయన చెప్పారని, కానీ అందుకు సంబంధించి ఎలాంటి పాస్, డాక్యుమెంట్లు ఆయన వద్ద లేవన్నారు. హెచ్​సీ మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.