
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అయింది. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా జరిగే విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు అమిత్ షా రానున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా ఒక రోజు ముందుగానే హైదరాబాద్ కు చేరుకుంటారు. సెప్టెంబర్ 16న రాత్రి 7:55 గంటలకు అమిత్ షా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. రాత్రి 8 గంటలకు సీఆర్పీఎఫ్ సెక్టార్ మెస్‌కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే అమిత్ షా బస చేస్తారు. అదే రోజు రాత్రి బీజేపీ నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది.
Also Read :- హర్యానాలో ఇంటర్నెట్ సేవలు బంద్
సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం8: 35 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్‌కు అమిత్ షా చేరుకుంటారు. 9 గంటల నుంచి 11 గంటల వరకు జరిగే తెలంగాణ విమోచన ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆపై పలు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. ఈ వేడుకల అనంతరం 11:15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ నుంచి బయలుదేరి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11.50 నిమిషాలకు రెండు రోజుల తెలంగాణ పర్యటన ముగించుకుని అమిత్ షా ఢిల్లీకి పయనమవుతారు.