హర్యానాలో ఇంటర్నెట్ సేవలు బంద్

 హర్యానాలో ఇంటర్నెట్ సేవలు బంద్

హర్యానా ప్రభుత్వం నుహ్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్, SMS సేవలను నిలిపివేసింది.  శుక్రవారం నుండి రెండు రోజుల పాటు సెక్షన్ 144lను విధించింది. ప్రజలు తమ ఇళ్ల వద్దే శుక్రవారం ప్రార్థనలు చేయాలని ప్రభుత్వం కోరింది.  కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌ను అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 

నుహ్‌ జిల్లాలో చెలరేగిన హింసాకాండ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మమ్మన్‌ ఖాన్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. జులై 31న హిందూ సంస్థ నిర్వహించిన ఊరేగింపులో నుహ్‌లో మత ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. యాత్ర అనంతరం చెలరేగిన హింసలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హస్తం ఉందని హర్యానా పోలీసులు  తెలిపారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి సమయంలో ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్నట్లు ఫిరోజ్‌పూర్‌ జిర్కా  డీఎస్పీ సతీష్‌ కుమార్‌ వెల్లడించారు.