అమితాబ్ కు అస్వస్థత… హాస్పిటల్ లో అడ్మిట్

అమితాబ్ కు అస్వస్థత… హాస్పిటల్ లో అడ్మిట్

కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. మంగళవారం ముంబైంలోని నానావతీ హాస్పిటల్ లో జాయిన్ అవగా లేటుగా విషయం బయటకు వచ్చింది. అయితే ప్రస్తుతం అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. బిగ్ బీ కోసం ఐసీయూ లాంటి స్పెషల్ రూం ను ఏర్పాటు చేశాయి దవఖానా వర్గాలు. ఆయన్ను చూసుకోవడానికి వారి కుటుంబసభ్యులు తరచూ హాస్పిటల్ కు వెళ్తుండడంతో బిగ్ బీ అనారోగ్యం విషయం బయటకు పొక్కింది.

అమితాబ్ కు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. 20సంవత్సరాల క్రితం కూలీ సినిమాలో అమితాబ్ గాయపడగా.. ఆయనకు చెడు రక్తాన్ని ఎక్కించారు. దీంతో ఆయన ఆరోగ్యం ఖరాబైంది. ఇందులో భాగంగా ప్రస్తుతం వారి కాలేయం 20 శాతం మాత్రమే పని చేస్తుంది. దీంతో… అమితాబ్ రెగ్యులర్ చెకబ్ చేయించుకుంటున్నారు.