"బ్రహ్మాస్త్ర"లో అమితాబ్ లుక్ రిలీజ్

"బ్రహ్మాస్త్ర"లో అమితాబ్ లుక్ రిలీజ్

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హీరో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో కనిపిస్తారన్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా తెరకెక్కించేందుకు చిత్ర నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ -1... సెప్టెంబర్ 9, 2022 న విడుదల చేస్తున్నారనే వార్తలు ఇప్పటికే రాగా.. తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఇప్పటికే రణ్ బీర్ త్రిశూలం పట్టుకొని ఫస్ట్ లుక్ లో ఆకర్షించగా.. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ నిర్వాహకులు. ఇందులో అతని క్యారెక్టర్  ని గురుగా సంబోధిస్తూ.. చేతిలో ఒక వెలుగులు విరజిమ్ముతున్న కత్తిని అమితాబ్ పట్టుకొని ఉన్న ఫొటో.. ఈ సినిమాపై మరిన్ని అంచనాలను క్రియేట్ చేస్తోంది. దీనికి సంబంధించిన పిక్ ను నటి ఆలియా భట్ పోస్ట్ చేస్తూ... అమితాబ్ పాత్రను గురువుగా, తెలివైన నాయకుడిగా పరిచయం చేస్తూ... ట్రైలర్ జూన్ 15న విడుదల కానుందంటూ నటి ఆలియా భట్ ట్వీట్ చేసింది.