డిజిటల్ కీ సర్పంచ్ లకు ఇచ్చేయండి.. వెల్గటూర్ లో సర్పంచుల నిరసన

డిజిటల్ కీ సర్పంచ్ లకు ఇచ్చేయండి.. వెల్గటూర్ లో సర్పంచుల నిరసన

గ్రామ పంచాయతీలకు నిధులివ్వక, కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న కేసీఆర్ సర్కారుపై సర్పంచుల పోరాటం తీవ్రరూపం దాల్చింది. పలు జిల్లాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలోనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లాలో సర్పంచ్ లు ఆందోళన బాట పట్టారు. వెల్గటూర్ ఎంపీడీవో ఆఫీసులో అఖిలపక్ష సర్పంచుల నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దొంగలాగా సర్పంచ్ ల డిజిటల్ ‘కీ’లు అపహరించి సీసీ చెక్కులు పాస్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తీరుకు నిరసనగా ఎంపీడీవో ఆఫీస్ ముందు సర్పంచ్ లు ఆందోళనకు దిగారు. తక్షణమే తమ డిజిటల్ కీలు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనుల చెక్కులు పాస్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో కు  సర్పంచ్ లు వినతిపత్రం అందజేశారు. డిజిటల్ కీలు సర్పంచ్ లకు ఇవ్వాలని..కేంద్ర ప్రభుత్వ నిధులు మళ్లించకుండా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఉపయోగపడేలా చూడాలని సూచించారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.