మనుషుల్లో రాక్షసత్వం ఇంత క్రూరంగా ఉంటుందా.. సోయి లేకుండా ఇలా చంపేస్తారా.. చంపితే చంపారు.. చంపిన తర్వాత కసి తీరకపోగా.. వింత వింత ఆలోచనలతో తమ పగ, ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నారు. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మనుషుల్లోని క్రూరత్వాన్ని చెబుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బీహార్ రాష్ట్రం జెహానాబాద్ ప్రాంతంలోని పార్స్ బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాద్ పూర్ గ్రామం. 23 ఏళ్ల కునాల్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోనే నివాసం ఉంటున్నాడు. ఇతని తల్లిదండ్రులతోపాటు అన్నయ్య, వదిన ఉన్నారు. ఫ్యామిలీ అంతా వ్యవసాయ చేసుకుంటూ.. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.
2026, జూలై 29వ తేదీన కుటుంబం అంతా వ్యవసాయ పనులకు వెళ్లారు. కునాల్ కుమార్ మధ్యలో ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న 25 ఏళ్ల వదిన అన్షదేవిని భోజనం పెట్టమని అడిగాడు. ఇంటి పనుల్లో ఉన్న వదిన అన్షుదేవికి భోజనం పెట్టటం ఆలస్యం అయ్యింది.
ఈ మాత్రం దానికే కునాల్ కుమార్ కు కోపం తన్నుకువచ్చింది. ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకుని వదినపై దాడి చేశాడు. వదిన అన్షుదేవి తలను వేరు చేశాడు. వదిన శరీరంపై ఇష్టారీతిన గొడ్డలితో పోట్లు పొడిచాడు. ఇంత చేసినా కునాల్ కుమార్ కోపం తగ్గలేదు.
వదిన అన్షుదేవి తలను.. ఇంటి బయట ఉన్న మర్రి చెట్టుకు వేలాడదీశాడు. ఆ తర్వాత ఇంటి ముందే ప్రశాంతంగా కూర్చుకున్నాడు. అటుగా వచ్చిన గ్రామస్తులు.. మర్రి చెట్టుకు వేలాడదీసిన తలను చూసి షాక్ అయ్యారు. పొలంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. అరెస్ట్ చేశారు.
కునాల్ కుమార్ గంజాయికి బానిస అయినట్లు చెబుతున్నారు గ్రామస్తులు. నిత్యం మత్తులో ఉంటాడని.. గంజాయి, మద్యం మత్తులో ఉంటాడని.. కుటుంబ సభ్యులు బలవంతంగా పనులకు తీసుకెళుతుంటారని చెబుతున్నారు గ్రామస్తులు. అతని మానసిక స్థితి సరిగా లేదంటున్నారు.
భోజనం పెట్టటం ఆలస్యం అయినందుకే ఇంత ఘోరం చేస్తాడా.. మనుషుల్లో క్రూరత్వం ఈ స్థాయికి చేరటానికి కారణాలు ఏంటీ అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
