జనాలపైకి కుక్కలు వదులుతున్న ఇన్స్పెక్టర్

జనాలపైకి కుక్కలు వదులుతున్న ఇన్స్పెక్టర్

ఇన్స్ పెక్టర్ పై కంప్లైంట్ చేసిన ఘటన ఎల్బీనగర్ పరిదిలో జరిగింది. ఎల్ బీనగర్ లోని చిత్రా లే అవుట్, మంజీరా హైట్స్ డీ బ్లాక్ లో నివసించే ఇన్స్ పెక్టర్ నాగేంద్రా రావు.. తరచూ తను పెంచుకునే కుక్కలను అపార్ట్ మెంట్ వాసులపైకి వదులుతున్నాడు. ఈ క్రమంలో భయబ్రాంతులకు గురైన అపార్ట్ మెంట్ వాసులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అపార్ట్ మెంట్ వాసుల కంప్లైంట్ తీసుకున్న పోలీసులు.. నాంగేంద్ర రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

వారం క్రితం అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఓ డాక్టర్ పైకి ఇలానే కుక్కలు వదిలాడు. ఆ దాడివల్ల గాయాలపాలైన డాక్టర్.. నాగేంద్రను నిలదీస్తే తన దైన శైలిలో బెదిరించాడు. ఇన్స్ పెక్టర్ చేశ్టలతో విసుగెత్తిపోయిన డాక్టర్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సీసీ  కెమెరాల ద్యారా ఆధారాలు సేకరించిన పోలీసులు.. నాగేంద్ర రావుపై చర్యలు తీసుకున్నారు.